కొవ్వూరు లిటరరీ క్లబ్ లో ఈ నెల 21వ తేదీన కార్యకర్తల సమావేశంతో పాటు దళితుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించనున్నట్లు జై భీమ్ దళిత ప్రజా వేదిక రాష్ట్ర అధ్యక్షుడు చోళ్ల రాజు తెలిపారు. సోమవారం జరగనున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చోళ్ల రాజు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి కార్యకర్తలు, దళిత సంఘాల ప్రతినిధులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమానికి సంబంధించిన ఆహ్వాన పోస్టర్ ని విడుదల చేశారు.