తోగుమ్మిలో టిడిపి డోర్ టు డోర్ కార్యక్రమం

కొవ్వూరు మండలం తోగుమ్మి గ్రామంలో నిర్వహించిన డోర్ టు డోర్ కార్యక్రమంలో కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలను కలుసుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకొన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. అనంతరం అర్హులైన లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో బేతిన నారాయణ, ఎం సత్యనారాయణ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్