కొవ్వూరు జనసేన పార్టీ ఇంచార్జిగా T. V. రామారావు పునర్నియామకం

కొవ్వూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ T. V. రామారావు, పలు ఆరోపణల నేపథ్యంలో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. ఆయన వ్యవహారంపై జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి శివశంకర్ నియోజకవర్గంలో పర్యటించి, క్షేత్రస్థాయి నివేదికను సమర్పించారు. ఈ నివేదికను పరిశీలించిన అనంతరం, జనసేన పార్టీ అధిష్టానం శనివారం T. V. రామారావును కొవ్వూరు నియోజకవర్గ ఇంచార్జిగా పునర్నియమిస్తూ ప్రకటన విడుదల చేసింది.

సంబంధిత పోస్ట్