రోడ్డు ప్రమాదంలో కపిలేశ్వరపురం మండల వాసి మృతి

కరప మండలం పెనుగుదురులో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గుత్తుల రామకృష్ణ (60) మృతి చెందారు. కపిలేశ్వరపురం మండలం మాచర గ్రామానికి చెందిన రామకృష్ణ, తన మనవడు విజయ్‌తో కలిసి మోటారు సైకిల్‌పై కుమార్తెను చూడటానికి వెళ్తుండగా, పెట్రోలు బంకు వద్ద లారీని తప్పించబోతుండగా, కాకినాడ నుంచి వస్తున్న కారు వీరిని ఢీకొట్టింది. కారు చక్రం రామకృష్ణపై నుంచి వెళ్లడంతో ఆయన అక్కడికక్కడే మరణించారు. గాయపడిన విజయ్‌ను కాకినాడ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్