కపిలేశ్వరపురం మండలం వెదురుమూడి వద్ద బ్రిటిష్ కాలం నాటి వంతెన శిథిలావస్థకు చేరిందని, రక్షణ గోడలు దెబ్బతినడంతో ప్రయాణికులు ప్రాణభయంతో ప్రయాణిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. కపిలేశ్వరపురం, మండపేట రహదారుల కూడలిలో ఉండటంతో రద్దీ పెరిగి ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు పేర్కొంటున్నారు. తక్షణమే కొత్త వంతెన నిర్మించాలని ప్రయాణికులు కోరుతున్నారు.