మాజీ ఎంపీపీ, టీడీపీ సీనియర్ నాయకులు మృతి

కపిలేశ్వరపురం మండలం అగ్రహారం గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ, టీడీపీ సీనియర్ నాయకులు కాదా రాంబాబు (64) ఆదివారం గుండెపోటుతో తుది శ్వాస విడిచారు. పార్టీ బలోపేతానికి ఆయన చేసిన కృషిని నాయకులు స్మరించుకున్నారు. ఆయన మృతి పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు. నాయకులు రాంబాబు పార్థివ దేహాన్ని సందర్శించి, పూలమాలలతో నివాళులర్పించారు. ఈ కష్టకాలంలో ఆయన కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

సంబంధిత పోస్ట్