మండపేట: ఆర్సీబీ ఫ్యాన్స్ మితిమీరిన సంబరాలు, ఆకతాయిలపై కేసులు

ఐపీఎల్ ఫైనల్స్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) విజయం సాధించిన నేపథ్యంలో, మండపేట కలువపువ్వు సెంటర్ వద్ద అభిమానులు మితిమీరిన విన్యాసాలు చేసి న్యూసెన్స్ సృష్టించారు. బైక్‌లపై త్రిపుల్ రైడింగ్, బాణాసంచా కాల్చడం ద్వారా ట్రాఫిక్‌కు, ప్రజాశాంతికి భంగం కలిగించారు. ఈ ఘటనపై సామాజిక మాధ్యమాల్లో వచ్చిన వీడియోలు, సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా టౌన్ సీఐ సురేష్ విచారణ చేపట్టారు. నిబంధనలు ఉల్లంఘించిన పలువురు ఆకతాయిలను గుర్తించి, వారిపై కేసులు నమోదు చేసినట్లు సీఐ మంగళవారం తెలిపారు. వేడుకల పేరిట హద్దులు మీరితే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్