అంగర పీహెచ్‌సీ పరిధిలో పల్స్ పోలియో సూపర్ సక్సెస్!

కపిలేశ్వరపురం మండలం అంగర పీహెచ్‌సీ పరిధిలో పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతంగా ప్రారంభమైంది. ఆదివారం మొదటిరోజే 95.7 శాతం లక్ష్యాన్ని పూర్తి చేసినట్లు వైద్యాధికారులు డాక్టర్ జె. అనూజ ప్రియాంక, డాక్టర్ వి. శ్రీపూర్ణ కళ తెలిపారు. మొత్తం 1,147 మంది చిన్నారులకు గాను 1,098 మందికి చుక్కలు వేశారు. ఇందుకోసం 11 బూత్‌లు, మొబైల్ టీమ్‌లను ఏర్పాటు చేశారు. మిగిలిపోయిన వారికి సోమ, మంగళవారాల్లో ఇంటింటికీ వెళ్లి చుక్కలు వేయనున్నారు.

సంబంధిత పోస్ట్