మండపేటలో వర్షం బీభత్సం

మండపేట పట్టణంలో ఆదివారం రాత్రి అనూహ్యంగా వచ్చిన తుఫాను బీభత్సం సృష్టించింది. గడచిన కొన్ని రోజులుగా మే నెలను తలపించేలా ఎండలు కాచి ప్రజలు ఉక్కపోతకు గురవుతుండగా రాత్రికి రాత్రే వాతావరణం మారిపోయింది. ఆకస్మికంగా మబ్బులు కమ్ముకొని పెనుగాలులతో కూడిన వర్షం కురిసింది. గంటసేపు ఈదురు గాలులు వీస్తూ పట్టణాన్ని అతలాకుతలం చేశాయి. ఈ తుఫాను ప్రభావంతో పలు చోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి.

సంబంధిత పోస్ట్