రామచంద్రపురం: ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆకస్మిక తనిఖీ

రామచంద్రపురం డివిజనల్ రెవిన్యూ ఆఫీసర్ డి అఖిల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గురువారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ తనిఖీలో భాగంగా ఆసుపత్రికి సంబంధించిన అవుట్ పేషెంట్ విభాగాన్ని, ల్యాబ్ ని, ఫార్మసీ విభాగాన్ని తనిఖీ చేసి రికార్డులను పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు. ప్రజలకు మరింత మెరుగైన సేవలను అందించాలని, ఐవీఆర్ఎస్ లో పేషెంట్ ఫీడ్ బ్యాక్ అన్ని విభాగాలకు సంబంధించి నూటికి నూరు శాతం ఉండాలని తెలియజేశారు.

సంబంధిత పోస్ట్