రాయవరం: రోడ్డు ప్రమాదంలో బాలుడు దుర్మరణం

రోడ్డు ప్రమాదంలో బాలుడు మృతి చెందాడు. సోమవారం ద్విచక్ర వాహనంపై వెళుతూ రోడ్డు పక్కన ఆగి ఉన్న వ్యానును ఢీకొట్టడంతో రాయవరం మండలం సోమేశ్వరానికి చెందిన సందీప్ (16) దుర్మరణం చెందాడు. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా రాయవరం ఎస్ఐ సురేశ్ బాబు తెలిపారు. పదో తరగతి పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తుండగా ఈ ప్రమాదం జరిగిందంటూ మృతుడి తల్లి ఆవేదన వ్యక్తం చేసింది.

సంబంధిత పోస్ట్