రాయవరం: ప్రేమ పేరుతో యువతిని మోసం

ప్రేమ పేరుతో యువతిని నమ్మించి మోసం చేసిన వెటర్నరీ అసిస్టెంట్ నూకతట్టు శ్రీనివాస్‌ను బుధవారం రాయవరం పోలీసులు అరెస్ట్ చేశారు. మండపేటకు చెందిన నిందితుడు వద్దిపర్రులో వెటర్నరీ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. రాయవరానికి చెందిన ఒక యువతిని ప్రేమ పేరుతో నమ్మించి, తీరా ఇప్పుడు మరో యువతితో వివాహానికి సిద్ధమవడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్