కపిలేశ్వరపురం మండలంలో చోరీ

కపిలేశ్వరపురం మండలం అంగర పోలీస్ స్టేషన్ పరిధిలోని వల్లూరు గ్రామంలో ఓ ఇంటిలో చోరీ జరిగింది. చికెన్ షాపు నిర్వాహకుడు మానుపాటి గణేష్ ఈ నెల 29న ఊరెళ్లగా, శుక్రవారం తిరిగి వచ్చి చూసేసరికి గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడి సుమారు రూ. 2,07,500 విలువైన ఆభరణాలను అపహరించుకుపోయారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్