రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. కాట్రేనికోన మండలంలోని పెనుమల్లలో ఈ నెల 3 వ తేదీన రెండు ద్విచక్రవాహనాలు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో తామరచెరువుకు చెందిన వెంకటరమణ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడి అమలాపురం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి చనిపోయాడని ఎస్సై అవినాష్ తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై బుధవారం పేర్కొన్నారు.