చెయ్యేరులో అగ్నిప్రమాదం: గడ్డివాము దగ్ధం

కాట్రేనికోన మండలం చెయ్యేరు గ్రామపంచాయతీ ఉప్పు చెరువు వద్ద మంగళవారం జరిగిన అగ్నిప్రమాదంలో ఒక గడ్డివాము పూర్తిగా దగ్ధమైంది. స్థానికులు సమాచారం అందించడంతో అగ్నిమాపక సిబ్బంది సకాలంలో చేరుకుని మంటలను అదుపు చేశారు. దీంతో పక్కనే ఉన్న ఇతర గడ్డివాములకు ప్రమాదం తప్పింది. వేసవిలో గడ్డి కొరత తీవ్రంగా ఉన్న నేపథ్యంలో నిల్వ కూడా కాలిపోవడంతో బాధిత రైతు కన్నీరుమున్నీరయ్యారు. వేసవి నేపథ్యంలో రైతులు గడ్డివాముల వద్ద తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, నీటి సౌకర్యం అందుబాటులో ఉంచుకోవాలని అగ్నిమాపక అధికారులు సూచించారు.

సంబంధిత పోస్ట్