ఐ. పోలవరం మండలం మురమళ్ల శ్రీవీరేశ్వర స్వామి ఆలయం కార్తీక శోభను సంతరించుకుంది. శనివారం నుంచి డిసెంబర్ 1 వరకు కార్తీక మాస మహోత్సవాలు వైభవోపేతంగా నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ఆలయ ఈవో లక్ష్మీనారాయణ శుక్రవారం తెలిపారు. కోనసీమలో ప్రముఖ పుణ్య క్షేత్రం కావడం జిల్లా మూలల నుంచి విశేష సంఖ్యలో వచ్చే భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. ఎస్ఈడి స్క్రీన్లు, క్యూలైన్లు ఏర్పాటు చేశామన్నారు.