ఐ. పోలవరం మండలం గుత్తెను దివి రంగా సెంటర్‌కు చెందిన ఇంద్రకంటి సుబ్రహ్మణ్య సుందర రామయ్యశర్మ, తాళ్లరేవు మండలం జార్జిపేటలోని సీతారామచంద్రమూర్తిస్వామి ఆలయంలో అర్చకుడిగా పనిచేస్తున్నారు. పాత కక్షల నేపథ్యంలో, శనివారం అదే గ్రామానికి చెందిన కొండమూరి శివయ్య కత్తితో అర్చకుడిపై దాడి చేశాడు. అనంతరం శివయ్య పోలీసు స్టేషన్‌లో లొంగిపోయాడు. దాడిలో గాయపడిన అర్చకుడిని స్థానికులు యానాం ఆసుపత్రికి తరలించారు.