ఐ. పోలవరం: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

ఐ. పోలవరం మండలం కొమరగిరి వద్ద 216 జాతీయ రహదారిపై గురువారం రోడ్టు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముమ్మిడివరం పరిధిలోని మట్టాడిపాలెం 20వ వార్డుకు చెందిన వంటపాటి వీరేంద్ర(32) మృతి చెందాడు. యానాంలో హమాలీగా పనిచేస్తున్న వీరేంద్ర తన పని ముగించుకొని యానాం నుండి తన ద్విచక్ర వాహనంపై ముమ్మిడివరం వస్తూండగా, అమలాపురం వైపునుండి కాకినాడ వెళుతున్న కారు ఢీకొనడంతో ఈ సంఘటన జరిగింది.

సంబంధిత పోస్ట్