ఐ. పోలవరం: రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకులు మృతి

ఐ. పోలవరం మండలం బాలయోగి వారధిపై మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. తాళ్లరేవు మండలం సుంకరపాలెంకు చెందిన వేళ్ల వీరేంద్ర, ముమ్మిడివరం మండలం కొత్తలంకకు చెందిన వేమవరపు సాంబశివ అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. సుంకరపాలెం నుంచి ముమ్మిడివరం వైపు బైకుపై వస్తున్న వీరిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. పోలీసులు విచారణ ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్