కాట్రేనికోన: నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

కాట్రేనికోన మండలం పరిధిలోని పలు గ్రామాలకు శుక్రవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగనుంది. చెట్లకొమ్మల తొలగింపు కారణంగా శుక్రవారం ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్తు సరఫరా ఉండదని అమలాపురం ఈఈ కె. రాంబాబు తెలిపారు. కాట్రేనికోన, వేట్లపాలెం, బలుసుతిప్ప, కొప్పిగుంట, పల్లం, నడవపల్లి, గెద్దనపల్లి, చెయ్యేరు, లక్ష్మివాడ తదితర గ్రామాలకు సరఫరా ఉండదన్నారు.

సంబంధిత పోస్ట్