ఉత్తమ సర్పంచ్ అవార్డు అందుకున్న కాట్రేనికోన మండలం గెద్దనాపల్లికి చెందిన సీతారామకృష్ణంరాజును గురువారం ఘనంగా సన్మానించారు. గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో సర్పంచ్ కృష్ణంరాజు గ్రామాన్ని అన్ని రంగాల్లోనూ అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని వక్తలు అభినందించారు. సన్మాన సభలో కాట్రేనికోన ఎస్సై అవినాష్, దాట్ల పవన్, ఆకాశం శ్రీనివాస్ ముదునూరు రంగరాజు, చెల్లి సురేష్ పాల్గొన్నారు.