గురువారం ఉదయం ముమ్మిడివరం మెయిన్ రోడ్ లోని విష్ణాలయం సమీపంలో ఒక జువెలరీ షాప్ లో దొంగలు తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించడానికి ప్రయత్నించారు. అయితే, షాప్ యొక్క ఐరన్ షట్టర్ అడ్డుగా ఉండటంతో వారి ప్రయత్నం విఫలమైంది. షట్టర్ తెరిచి ఉండటాన్ని గమనించిన షాప్ యజమాని పోలీసులకు సమాచారం అందించారు. ముమ్మిడివరం ఎస్ఐ జ్వాలాసాగర్ ఆధ్వర్యంలో క్లూస్ టీమ్స్ సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరిస్తున్నట్లు తెలిపారు.