ముమ్మిడివరం: గుండెపోటుతో లెక్చరర్ మృతి

యానం, ముమ్మిడివరం కళాశాలల్లో బోటనీ లెక్చరర్‌గా పనిచేస్తున్న శంకర్ (40) మంగళవారం గుండెపోటుతో మరణించారు. మంగళవారం సాయంత్రం వరకు విధులను పూర్తి చేసుకుని ఇంటికి వెళ్లిన ఆయనకు అకస్మాత్తుగా గుండెనొప్పి రావడంతో ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. శంకర్ మృతి పట్ల కళాశాల యాజమాన్యం, సహోద్యోగులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్