ఐ పోలవరం మండలం పాత ఇంజరం గ్రామంలో ఏరువాక కార్యక్రమం నిర్వహించారు. బుధవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో వ్యవసాయ పనులకు ఎమ్మెల్యే శ్రీకారం చుట్టారు. కాడెద్దులతో ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు దుక్కిని ప్రారంభించారు. భూసార పరీక్షల ద్వారా ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునే వరి వంగడాలను వేయాలని దాట్ల సూచించారు. గత ప్రభుత్వ నిర్వాకం వల్ల సాగునీరు సకాలంలో అందడం లేదని విమర్శించారు. గత ప్రభుత్వం ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసిందన్నారు.