ముమ్మిడివరం: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు మృతి చెందాడు. ముమ్మిడివరం మండలం పరిధిలోని ముమ్మిడివరం-కొండాలమ్మ చింత బైపాస్ రోడ్డు వద్ద శనివారం పల్సర్ పై వెళ్తున్న యువకుడిని టాటా ఏస్ వాహనం ఢీకొట్టింది. దీంతో ఆ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదం నేపథ్యంలో స్వల్పంగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్