లారీ ఢీకొని ఒకరు మృతి

లారీ ఢీకొని ఈతకోట శ్రీనివాసరావు(43) అనే వ్యక్తి మృతి చెందిన ఘటన శుక్రవారం మధ్యాహ్నం కాట్రేనికోనలోని తిమ్మాపురంలో చోటుచేసుకుంది. దొంతికుర్రులోని మర్లచెరువుకు చెందిన ఆయన తన బంధువుల మహిళకు కాట్రేనికోన పీహెచ్సీలో ప్రసవం జరగడంతో శుక్రవారం తన భార్య విజయను ఆసుపత్రిలో దింపి బైక్ పై ఇంటికి వస్తుండగా లారీ ఢీకొట్టింది. తలకు తీవ్ర గాయాలవడంతో అమలాపురం ఏరియా ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕