నత్త..భయం!

నత్తలు రైతులను నట్టేట ముంచుతున్నాయి.. కొత్త కష్టం రావడంతో రైతులు విల విల్లాడిపోతున్నారు. ఎలా అరికట్టాలో తెలియక ఆపసో పాలు పడుతున్నారు. లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి వేసిన పంట నాలుగు రోజులకే నాశనమై పోతుండడంతో నలిగిపోతున్నారు. తాళ్లపూడి మండలం రావూరుపాడు గ్రామం కూరగాయల పంటలకు ప్రసిద్ధి. ఇక్కడ వందలాది ఎకరాల్లో అన్ని రకాలు సాగు చేస్తారు.ఆకు కూరలు, కూరగాయలు ఎక్కు వగా పండిస్తారు. క్యాలీఫ్లవర్‌, క్యాబేజీ, వంకాయ తదితర రకాలు సాగు చేస్తారు. వీటిని నారుదశ నుంచి పెంచాల్సి ఉంటుంది. నారు దశలోనే కాండం తినేయడంతో ఎదుగుదల ఉండడంలేదు. ఆకు కూర లదీ ఇదే పరిస్థితి.

సంబంధిత పోస్ట్