అదుపుతప్పి టిప్పర్ లారీ బోల్తా

డా. బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం వేట్లపాలెం రోడ్డులో శనివారం కంకర లోడుతో వెళ్తున్న టిప్పర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఎదురుగా వస్తున్న ఆటోను తప్పించే ప్రయత్నంలో ఈ ప్రమాదం జరిగింది. డ్రైవర్ అప్రమత్తమై బయటకు దూకడంతో ప్రాణాపాయం తప్పింది. అలాగే రోడ్డుపై ఇతర వాహనాలు కూడా లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లు అయ్యింది.

సంబంధిత పోస్ట్

✕
✕