రూ.20 కోసం దంతాలు ఊడేలా దాడి

చొక్కా కుట్టినందుకు రూ. 20 బకాయి అడిగిన దర్జీపై ఓ యువకుడు దాడి చేసి దంతాలు ఊడేలా కొట్టాడు. గురువారం మెట్టకూరు వంశీకృష్ణ కాలనీలో ఈ ఘటన జరిగింది. కొప్పనాతి వెంకటరమణ అనే యువకుడు ఈగల మల్లికార్జునరావు అనే దర్జీ వద్ద చొక్కా కుట్టించుకున్నాడు. బకాయి అడిగినందుకు ఆగ్రహించిన వెంకటరమణ, ఇనుప ఆయుధంతో మల్లికార్జునరావు ముఖంపై దాడి చేయడంతో అతని దంతాలు ఊడిపోయాయి. బాధితుడిని ఆసుపత్రికి తరలించగా వైద్యులు చికిత్స అందించారు. పోలీసులు నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసి, నిందితుడిని శుక్రవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

సంబంధిత పోస్ట్