ఉండ్రాజవరం లో బీజేపీ మండల కమిటీ సమావేశం

తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం ఉండ్రాజవరం లింగాల దిబ్బ రామాలయం వద్ద శనివారం బీజేపీ మండల కమిటీ సమావేశం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు బూరుగుపల్లి వెంకటేశ్వర్లు, సత్యనారాయణ, కిసాన్ మోర్చా జిల్లా జనరల్ సెక్రటరీ అక్కిన గోపాలకృష్ణ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕