ఉండ్రాజవరంలో వంగవీటి మోహన రంగా విగ్రహం ఏర్పాటు విషయంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాపు సంఘం ఆధ్వర్యంలో రంగా విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేయగా గురువారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు విగ్రహాన్ని అపహరించుకెళ్లినట్లు సమాచారం. దీంతో శుక్రవారం రెండు వర్గాల మధ్య వివాదం తలెత్తి ఘర్షణ వాతావరణం ఏర్పడింది. మరో విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు నిర్వాహకులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, విగ్రహం ఏర్పాటుకు ప్రయత్నించిన నిర్వాహకుల మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. పరిస్థితిని అదుపులోకి తీసుకుచ్చేoదుకు పోలీసులు భారీగా మోహరించారు.