టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన పల్లాశ్రీనివాసరావును నిడదవోలు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, పార్టీ ఇన్ చార్జి బూరుగుపల్లి శేషారావు శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. పార్టీ పటిష్ఠతకు తన వంతు సహకారం అందిస్తానని అన్నారు. ఆయన వెంట నిడదవోలు పట్టణాధ్యక్షుడు వెంకటేశ్వరరావు ఉన్నారు.