70 లక్షల వ్యయంతో తాడిపర్రు PACS నూతన భవనం శంకుస్థాపన.

ఉండ్రాజవరం మండలం తాడిపర్రులో రూ. 70 లక్షల వ్యయంతో నిర్మించనున్న ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (PACS) నూతన భవనానికి మంత్రి కందుల దుర్గేష్ గురువారం శంకుస్థాపన చేశారు. తాడిపర్రు PACS రాష్ట్రంలోనే ఆదర్శ సహకార సంఘంగా నిలవడం గర్వకారణమని ఆయన స్పష్టం చేశారు. సొసైటీ సొంత నిధులు, రైతులకు వచ్చే డివిడెండ్లు, సభ్యుల సహకారం, దాతల విరాళాలతో ఈ భవన నిర్మాణానికి ముందుకు రావడం గ్రామ ఐక్యతకు నిదర్శనమని తెలిపారు. ఈ భవనంలో ఆధునిక గిడ్డంగి కార్యాలయం ఏర్పాటు చేయడం ద్వారా రైతులకు మరింత మెరుగైన సేవలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్