నిడదవోలు: గంజాయి రవాణా కేసులో 11 మంది అరెస్ట్

నిడదవోలు పట్టణంలో టిట్కో ఇళ్ల సమీపంలో గంజాయ్ అక్రమ రవాణాకు పాల్పడుతున్న11 మంది అరెస్టు చేసినట్లు నిడదవోలు సీఐ గంగాధర్ తిలక్ శనివారం సాయంత్రం విలేకరులకు తెలిపారు. గత కొంతకాలంగా వీరు ఒడిశా సరిహద్దులోని ఏజెన్సీ ప్రాంతాల నుంచి గంజాయి తెచ్చి ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు రవాణా చేస్తున్నట్లు ఆయన తెలిపారు. దీనిపై అందిన సమాచారం మేరకు నిడదవోలు ఎస్ఐ శోభన్ కుమార్ ఆధ్వర్యంలో వారిని అరెస్టు చేసామన్నారు.

సంబంధిత పోస్ట్