సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందేందుకు అవసరమైన అన్ని ప్రోత్సాహకాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నారని నిడదవోలు ఎమ్మెల్యే, మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ఆదివారం విజయవాడలో వెస్ట్రన్ లవ్ అనే సినిమా పూజ ముహూర్త మహోత్సవానికి తొలి క్లాప్ కొట్టారు. సినిమా షూటింగ్ లకు ఆంధ్రప్రదేశ్ అనువైన ప్రాంతమని పేర్కొన్నారు.