నిడదవోలులో ప్రమాదవశాత్తు కాలువలో పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. రాజమండ్రి రూరల్ మండలం బొమ్మూరు గ్రామానికి చెందిన బొర్రా నాగరాజు కాంట్రాక్టు లేబర్ గా నిడదవోలు సమీపంలోని తాళ్లపాలెం వెళ్ళాడు. విధి నిర్వహణలో భాగంగా బుధవారం ప్రమాదవశాత్తు కాలువలో పడి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న రూరల్ టీడీపీ అధ్యక్షుడు మత్సేటి ప్రసాద్ ఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు.