నిడదవోలు మండలం కంసాలిపాలెం నుండి మాధవరం వెళ్లే ప్రధాన రోడ్డు గుంతలమయంగా మారింది. రోడ్డంతా గుంతలతో నిండిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా వర్షాకాలంలో ప్రయాణం మరింత ప్రమాదకరంగా మారుతోంది. విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు మరియు అత్యవసర సేవలకు వెళ్లే ప్రజలు ప్రతిరోజూ ఇబ్బందులుఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి వెంటనే రోడ్డు మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు