పెద్దాపురం నియోజకవర్గ పరిధిలోని దివిలి, ఆనూరు విద్యుత్తు ఉపకేంద్రంలలో వార్షిక మరమ్మతులతో శనివారం ఉదయం 8 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఉంటుందని ఈఈ ప్రభాకర్ తెలిపారు. తిరుపతి, కాండ్రకోట, ఉలిమేశ్వరం, చదలాడ, మరావ, తూర్పుపాకలు, ఆనూరు, కొండపల్లి గ్రామాలకు విద్యుత్తు ఉండదన్నారు. కావున విద్యుత్ వినియోగదారులు తమకు సహకరించాలని కోరారు.