పెద్దాపురం పట్టణంలోని 33/11కేవీ విద్యుత్తు ఉపకేంద్రంలో వార్షిక మరమ్మతుల కారణంగా శనివారం ఉదయం 7.30 నుంచి 9 గంటల వరకు సరఫరాకు అంతరాయం కలుగుతుందని ఆ శాఖ ఈఈ ఏవీఎన్డీఎస్ ప్రభాకర్ తెలిపారు. నవోదయ, ఎన్టీఆర్ కాలనీ, రాజీవ్ కాలనీ, ప్రభుత్వాసుపత్రి, దర్గా సెంటర్, మరిడమ్మగుడి, తాడితోట, గౌరీకోనేరు కాలనీ, వ్యాపారపుంత, ఆర్బీపట్నం రహదారి, సినిమా సెంటర్, శివాలయం వీధి ప్రాంతాల్లో సరఫరాకు అంతరాయం ఏర్పడుతోందన్నారు.