మున్సిపల్ కౌన్సిల్ హాల్ లో కాకినాడ ఆర్డిఓ మల్లిబాబు ఆధ్వర్యంలో చైర్ పర్సన్ అవిశ్వాస తీర్మానంపై ప్రత్యేక సమావేశం జరగనుండగా, సామర్లకోట మున్సిపల్ చైర్ పర్సన్ గంగిరెడ్డి అరుణ తన చైర్ పర్సన్ పదవికి రాజీనామా చేశారు. గురువారం ఉదయం మున్సిపల్ కార్యాలయంలో తన రాజీనామా పత్రాన్ని మున్సిపల్ కమిషనర్ అనిశెట్టి శ్రీవిద్యకు అందజేశారు. అనంతరం నాలుగేళ్ల పాటు తనకు సేవలు అందించిన చైర్ పర్సన్ కుర్చీకి పూలమాలలు వేసి గౌరవపూర్వకంగా తన రాజీనామాను అందజేసారు.