రాష్ట్ర ప్రభుత్వం అందించే ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు–2026 కోసం అర్హులైన ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి రమేశ్ తెలిపారు. ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపల్, ఎయిడెడ్, మోడల్ స్కూల్స్, ఐటీడీఏ, కేజీబీవీ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకోవచ్చని గొల్లప్రోలు మండల విద్యాశాఖ అధికారి శివప్రసాద్ వెల్లడించారు. అర్హతలు, ఎంపిక విధానం, దరఖాస్తు ప్రక్రియకు సంబంధించిన వివరాలను విద్యాశాఖ మార్గదర్శకాల ప్రకారం పరిశీలించి, నిర్ణీత గడువులోపు దరఖాస్తులు సమర్పించాలని సూచించారు.