గొల్లప్రోలులోని మద్యం షాపు వద్ద గురువారం రాత్రి జరిగిన ఘర్షణలో ఇద్దరు వ్యక్తులు కత్తిపోట్లకు గురయ్యారు. స్థానిక బస్టాండు సమీపంలోని మద్యంషాపు వద్ద సైకిల్ పడిపోయిన విషయంలో జరిగిన ఘర్షణ కత్తిపోట్లకు దారితీసింది. ఈ ఘర్షణలో జి. నాగేశ్వరరావు, ఎ. వీరబాబు కత్తిపోట్లకు గురయ్యారు. వీరిని తొలుత పిఠాపురం తర్వాత కాకినాడ జీజీహెచ్ కు చికిత్స నిమిత్తం తరలించారు. మద్యం షాపు వద్ద జరిగిన ఈ సంఘటన సంచలనం కలిగించింది.