గొల్లప్రోలు మండలం చేబ్రోలు సబ్ స్టేషన్ పరిధిలో కొన్ని గ్రామాలకు గురువారం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగనుందని ఎపిఈపిడిసిఎల్ ఈఈ ప్రభాకర్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆర్డిఎస్ఎస్ పథకంలో నూతన విద్యుత్ లైన్లు నిర్మాణం చేయనున్నందున చెందుర్తి, వన్నెపూడి, కొడవలి గ్రామాల్లో ఉదయం 8 గంటల నుంచి 2 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందని తెలిపారు. కావున విద్యుత్ వినియోగదారులు తమకు సహకరించాలని కోరారు.