ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాలో పవిత్ర స్నానం చేశారు. సతీమణి అన్నా లెజ్నోవా, కుమారుడు అకీరా, డైరెక్టర్ త్రివిక్రమ్తో కలిసి స్నానం ఆచరించారు. అంతకుముందు త్రివేణీ సంగమం వద్ద గంగా మాతకు హారతులు ఇచ్చి ప్రత్యేక పూజలు చేశారు. మహాకుంభమేళాలో పాల్గొనడం అందరికీ గొప్ప అవకాశం అని పవన్ తెలియజేశారు. ఇంతటి గొప్ప కార్యక్రమం నిర్వహిస్తున్న యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.