డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నేరుగా అమరావతి నుంచి మధ్యాహ్నం 3. 45 గంటలకు చిత్రాడ సభా ప్రాంగణం సమీపంలోని హెలీప్యాడ్లో దిగనున్నారు. సభా వేదికకు 500మీటర్ల దూరంలోనే హెలిప్యాడ్ ను నిర్మించారు. ఈ సభలో పవన్ దాదాపు రెండు గంటలకుపైగా ప్రసంగించే అవకాశం ఉంది. ఎన్నో మరపురాని జ్ఞాపకాలు ఇచ్చిన పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు నిండు మనసుతో కృతజ్ఞతలు తెలిపేందుకు థాంక్యూ పిఠాపురం చెప్పుకుందాం అనే నినాదంతో ఈ సభ జరగనున్నది.