ఇసుక కొరత తీర్చాలంటూ తహశీల్దార్ కు వినతిపత్రం

ఇసుక కొరత ఏర్పడడంతో భవన నిర్మాణ కార్మికులందరికీ ఉపాధి లేకుండా పోయిందని, వేలాదిమంది భవన నిర్మాణ కార్మికులతో పాటు అనుబంధ రంగాల్లో కార్మికులు రోడ్డున పడ్డారని రామచంద్ర బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ నాయకులు తెలిపారు. మంగళవారం యూనియన్ సభ్యులతో కలిసి ధర్నా నిర్వహించారు. నూతన ఇసుక విధానంతో ఉపాధి లేక అప్పు చేసి సరుకులు కొనితెచ్చుకోవాల్సిన పరిస్థితి దాపురించిందన్నారు. అనంతరం తహశీల్దార్ కు వినతిపత్రం సమర్పించారు.

సంబంధిత పోస్ట్