పిఠాపురం నియోజకవర్గంగా ఒక్కసారిగా ఆదివారం రాత్రి కురిసిన గాలివానకు అంధకారంలో ఉంది. భారీ వర్షం గాలుల నేపథ్యంలో విద్యుత్ స్తంభాలు, వైర్లు నేలకొరిగాయి. పిఠాపురం నియోజవర్గ పరిధిలో ఉన్న గ్రామాలన్నీ అంధకారంలో ఉన్నాయి. కరెంట్ లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎప్పుడు వస్తుందో అధికారులు కూడా చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.