పిఠాపురంలో కలెక్టర్ కు షాక్

పిఠాపురం పట్టణంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమంలో కాంట్రాక్టర్ సూరవరపు దివానం అసభ్య పదజాలంతో కాకినాడ జిల్లా కలెక్టర్ షన్మోహన్ ను దూషించారు. తాను చేసిన పనులకు బిల్లులు చెల్లించలేదంటూ దురుసుబాటుగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ దుర్భాషలాడారు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని ఆ కాంట్రాక్టర్ ను బయటకు తీసుకెళ్లారు. కలెక్టర్ ను దూషించడంపై అధికారులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్