కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం తాటిపర్తి గ్రామంలో అధికార పార్టీ కూటమి నాయకులకు, వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు మధ్య శనివారం విభేదాలు తలెత్తాయి. అధికారులు మధ్య సమన్వయ లోపంతో జరుగుతున్న నీటి సంఘాల ఎన్నికను ఎలక్షన్ అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. దీంతో ఆ ప్రాంతమంతా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. పోలీసులు అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.