డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ నియోజకవర్గమైన పిఠాపురం నందు జనసేనపార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి బయటపడ్డాయి. సోమవారం అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఇందిరానగర్ ప్రాంతంలో జరిగిన వేడుకల్లో ఇరు వర్గాలు ఘర్షణ పడ్డాయి. పిఠాపురం టౌన్ జనసేన పార్టీ అధ్యక్ష పదవి కోసం రెండు వర్గాల మధ్య ఈ అంతర్గత పోరు నడుస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇరు వర్గాల నాయకులు ఒకరిపై ఒకరు కేకలు వేసుకోవడంతో కాసేపు గందరగోళం నెలకొంది.